Niharika: మెగా డాటర్ నిహారిక పేరు గత కొంతకాలంగా తరచు వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. జొన్నలగడ్డ వెంకట చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా వారి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయటంతో వీరి విడాకులు వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలా విడాకుల గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ నిహారిక మాత్రం తన కెరీర్ మీద దృష్టి పెట్టింది. పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నిహారిక ఇటీవల కొత్త ఆఫీసు కూడా ప్రారంభించింది. ఇక నిహారిక నటించిన ‘ డెడ్ పిక్సెల్స్ ‘ అనే వెబ్ సిరీస్ మే 19వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచింది.ఈ వెబ్ సిరీస్ లో గాయత్రి అనే పాత్రలో నిహారిక కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో నిహారిక పాల్గొనింది. ఈ క్రమంలో విడాకుల గురించి నిహారిక కి ప్రశ్న ఎదురయింది. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజా నిజాలు ఏంటి అని నిహారికను ప్రశ్నించగా…ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నిహారిక దాటవేసింది.

Niharika: విడాకుల ప్రశ్న దాటివేసిన నిహారిక…
ఇలా విడాకుల వార్తలు గురించి నిహారిక మౌనం వహించటంతో ఈ వార్తలలో నిజం ఉందని నమ్ముతున్నారు. ఒకవేళ తన భర్తతో విడాకులు తీసుకోకపోతే నిహారిక ఈ వార్తలను ఖండించేదని , ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి నిహారిక మౌనంగా ఈ ప్రశ్నను దాటవేసిందని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు కూతురి గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చిన స్పందించే నాగబాబు ఇన్ని రోజులుగా కూతురి విడాకులు వార్తలు వినిపిస్తున్నప్పటికీ నాగబాబు స్పందించకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది