Niharika: మెగా డాటర్ నిహారిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు ఎప్పుడైతే తన భర్తకు విడాకులు ఇస్తున్నానని అధికారికంగా ప్రకటించారో ఆ సమయం నుంచి ఈమె సోషల్ మీడియాలో తరచూ అభిమానులను సందడి చేస్తున్నారు.తనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుంటున్నారు.

ఈ విధంగా విడాకుల వార్తలు ప్రకటించిన తర్వాత నిహారిక తన స్నేహితులతో కలిసి పలు ప్రదేశాలకు వెకేషన్ వెల్లడమే కాకుండా పార్టీలు చేసుకుంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. నిహారిక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇలా భర్త నుంచి విడిపోయిన ఈమె కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా మారిపోయారు.
తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాలభైరవ, నిహారికలు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతుంది.ఈ క్రమంలోనే నేడు కాలభైరవ పుట్టినరోజు కావడంతో నిహారిక తనతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Niharika: హ్యాపీ బర్త్‌డే బాబు….
హ్యాపీ బర్త్‌డే బాబు.. నువ్వే మా జీవితాల్లో వెలుగును తీసుకొచ్చావ్. థాంక్స్.. లెట్స్ హ్యావ్ ఫన్ డే ‘అని రాసుకొస్తూ.. కాలభైరవతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ప్రారంభించి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.