Nikhil: హీరో నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా నటించిన సినిమా కార్తికేయ 2. ఆగస్టు 12వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కార్తికేయ 2 సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదల చేయటంతో నిఖిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలో కూడా సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ హీరోయిన్ అనుపమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.షూటింగ్ అంటే ఉదయం ఐదు గంటలకే షూటింగ్ లో ఉండే అనుపమ ప్రమోషన్స్ అంటే మాత్రం నిరాకరిస్తుంది. సినిమా షూటింగ్ విషయంలో చాలా ప్రొఫెషనల్ గా ఫ్రెండ్లీగా ఉండే అనుపమ ప్రమోషన్స్ అనగానే ఆమె నుండి రెస్పాన్స్ ఉండదు అని నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అనుపమ కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ కి పూర్తిగా దూరంగా ఉండలేదు. అప్పుడప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొనింది. ఇదిలా ఉండగా 2014 లో విడుదలైన కార్తికేయ సినిమా కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించిన కార్తికేయ 2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. మొదట జూలై 5వ తేదీ ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు.
Nikhil: థియేటర్లు దొరక్క ఇబ్బందులు పడ్డాము…
అదే రోజు కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమా విడుదల కానుంది. అందువల్ల ఈ సినిమాను ఆగష్టు 12 న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా ఎన్నో కారణాలవల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ఈ సినిమాను విడుదల చేయడానికి థియేటర్లు దొరకడం లేదని కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
































