బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటులలో పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబుకు బుల్లితెరపై ఎనలేని క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ లో మాత్రమే కాకుండా,హిట్లర్ గారి పెళ్ళాం సీరియళ్లలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు.

ప్రస్తుతం జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ అనే షో ప్రసారమవుతుంది. ఇందులో భాగంగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమంలో హిట్లర్ గారి పెళ్ళాం వర్సెస్ వైదేహి సీరియల్ పరిణయం నటీనటుల మధ్య గట్టి పోటీ జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ బాబు హిట్లర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ షోలో భాగంగా నిరుపమ్ ఒక ఎత్తైన ఉయ్యాలపై కూర్చుని ఒక ఆట ఆడుతున్నారు. ఎంత సరదాగా ఈ షో సాగిపోతున్న క్రమంలో వెనక నిలబడి ఉన్న వ్యక్తి కొద్దిగా గట్టిగా తోయడంతో ఉన్నపళంగా నిరుపమ్ ఉయ్యాల పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డారు.
డాక్టర్ బాబు ఒక్కసారి పైనుంచి కింద పడేసరికి అతనికి ఏం జరిగిందోనని షోలో ఉన్న వారందరూ ఒక్కసారిగా ఎంతో కంగారుపడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో స్టేజ్ మీద స్పాంజ్ లు ఉండటం చేత అతనికి ఎలాంటి గాయాలు తగలక పోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































