బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఈ సీరియల్ ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా మారడంతో కార్తీకదీపం సీరియల్స్ కి రేటింగ్ బాగా పెరిగిపోయింది. ఇక ఈ సీరియల్లో డాక్టర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ అభిమానులతో ముచ్చటిస్తూ కార్తీకదీపం సీరియల్ దర్శకుడు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

డాక్టర్ బాబు మాట్లాడుతూ… ఈ సీరియల్ లో నన్ను ఆయన నిరుపమ్ అని పిలవకుండా…డాక్టర్ బాబు అంటూ ఏదో ఇంట్లో మనిషిని పిలిచినట్లు పిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అదేవిధంగా దర్శకుడు రాజేంద్రతో ఇది నా ఫస్ట్ సీరియల్ కాదు.ఇంతకుమునుపే చంద్రముఖి సెకండ్ షెడ్యూల్ నుంచి అతనితో నా ప్రయాణం కొనసాగుతోంది. అప్పుడే తనతో పని చేయడం ఎంతో సౌకర్యంగా అనిపించింది అని తెలిపారు.
ఇతర దర్శకులతో పోలిస్తే రాజేంద్రగారు ఎంతో భిన్నంగా ఉంటారు. ఏ దర్శకుడైన వారు చెప్పిన విధంగానే చేయాలి. కానీ రాజేంద్ర గారు మాత్రం ముందు మనం ఎలా చేస్తామో అలా చేయిస్తారు. అందులో ఏవైనా తప్పులు ఉంటే సరి చేస్తారు. అందుకోసమే ఇతని దగ్గర పనిచేయడం ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుందని కార్తీక్ బాబు తెలిపారు. నాతో పని చేయడానికి అంటే ముందుగా అతనికి చాలా షార్ట్ టెంపర్ ఉంది. ఇప్పుడు మారారని చాలామంది చెబుతుంటారు.
ఇప్పటికే ఆయన అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటారని.. ఆ సమయంలో మనం అక్కడినుంచి సైడ్ అయిపోతామని తెలిపారు. అయితే రాజేంద్ర గారు ఆర్టిస్టులపై కాకుండా సెట్ గురించో, ప్రాపర్టీ గురించో.. డైరెక్టర్ డిపార్ట్‌మెంట్ వాళ్లు పొరపాటున ఏదైనా తప్పు చేస్తే వారిపై కొప్పడతారు అంటూ డైరెక్టర్ రాజేంద్ర గురించి డాక్టర్ బాబు తెలియజేశారు.































