ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఫ్రీ కరోనా టెస్టులు ఉండవా?

0
320

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి విదితమే. భారత్ లో కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికి వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి రావాల్సి ఉంది. కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మినహా వైరస్ బారిన పడకుండా మరో మార్గం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

మరోవైపు కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్ల నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా కరోనా పరీక్షలను నిర్వహించాయి. కరోనా పరీక్షల కోసం కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని ఖర్చు చేశాయి. అయితే వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకపై ఫ్రీగా కరోనా పరీక్షలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చాయి.

తాజాగా మేఘాలయ ప్రభుత్వం వచ్చే వారం నుంచి కరోనా పరీక్షలపై ఛార్జీలను వసూలు చేస్తామని కీలక ప్రకటన చెసీంది. భారత వైద్య పరిశోధన మండలి ఇప్పటికే కరోనా టెస్టింగ్ కిట్లపై సబ్సిడీని ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో ఈ నెల 16వ తేదీ నుంచి ఛార్జీలు చెల్లించిన వారి శాంపిళ్లను మాత్రమే తీసుకోనున్నారు. ఏ కరోనా పరీక్ష చేయించుకున్నా ఛార్జీలు చెల్లించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది.

అయితే కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నవారు. దారిద్రరేఖకు దిగువన ఉన్నవారు, జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారులకు మేఘాలయ ప్రభుత్వం మినహాయింపును ఇవ్వనుందని తెలుస్తోంది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుకు 500 రూపాయలు. ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్, సీబీఎన్ఏఏటీ టెస్టులకు 3,200 రూపాయలు మేఘాలయ సర్కార్ వసూలు చేయనుందని తెలుస్తోంది.