బిగ్ బాస్ కార్యక్రమం 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే 13వ వారం లో నామినేషన్ ప్రక్రియ ఎంతో వేడిగా కొనసాగాయి హౌస్ లో కేవలం ఐదు మంది మాత్రమే ఉండడంతో ఎవరికి వారు సేఫ్ గేమ్ ఆడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్స్ లో భాగంగా కేవలం షణ్ముఖ్ సన్ని తప్ప మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్ లు నామినేషన్స్ లో ఉన్నారు.

అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందుగానే షణ్ముఖ్ కాజల్ ఇద్దరు చాలాసేపు మాట్లాడుతున్నారు.ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ నువ్వు మానస్, కాజల్ ,సన్నీని నామినేట్ చేయమని ధీమాతో ఉన్నారు అంటూ తనని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారు.
ఇక షణ్ముఖ్ కాజల్ ను కమ్యూనిటీ అనే పదం వాడిందని అది చాలా పెద్ద మాట ఇలాంటి ఫ్లాట్ఫామ్ దగ్గర అలాంటి మాటలు మాట్లాడకూడదు అందుకే నామినేట్ చేస్తున్నానని నామినేట్ చేశాడు. అయితే కాజల్ ఎలాంటి పరిస్థితిలో ఆమె కమ్యూనిటీ అనే పదం వాడిందో అని వివరించే ప్రయత్నం చేస్తూ చాలా సేపు వాదించారు.
ఇక ప్రియాంక తను ఎవరిని నామినేట్ చేయడానికి ఎలాంటి రీజన్స్ లేవని తనకు కాసేపు టైం కావాలని బిగ్ బాస్ ను కోరింది. కానీ చివరికి బిగ్ బాస్ నామినేట్ చేయాలని సూచించడంతో షణ్ముఖ్ చెప్పిన కమ్యూనిటీ పదాన్ని వాడుకొని తను కాజల్ ను నామినేట్ చేయడంతో పాటు సిరిని కూడా నామినేట్ చేస్తుంది. అయితే నామినేషన్స్ అనంతరం తాను కమ్యూనిటీ అని ఎవరిని ఉద్దేశించి అనలేదని ఒక గుంపుగా ఉన్నవారిని కూడా కమ్యూనిటీ అంటారు అంటూ ఈ విషయం గురించి పెద్ద ఎత్తున రచ్చ చేశారు.




























