Nora Fatehi: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సెలబ్రిటీలు ప్రతి ఒక్క విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే వీరు ఏ విషయంలోనైనా కాస్త ఆ శ్రద్ధ వహించిన లేదా పొరపాటు జరిగిన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా నటి నోరా ఫతేహి సైతం పెద్ద ఎత్తున నెటిజన్ల ట్రోలింగ్ కి గురి అవ్వడమే కాకుండా, తాను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.అయితే క్షమాపణలు చెప్పే అంత తప్పు ఏం చేశారనే విషయానికి వస్తే…. ప్రస్తుతం ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ మీద నోరా ఫతేహి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.
ఇలా ఈమె డాన్స్ చేస్తూ ఉండగా స్టేజ్ కిందనే ఓ వ్యక్తి మన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నటి నోరా ఫతేహి జాతీయ పతాకం తనకు ఇవ్వాలని కోరడంతో ఆ వ్యక్తి తనకు జాతీయపతాకాన్ని అందించారు. అయితే ఈమె డాన్స్ చేస్తున్న సమయంలో పొరపాటున త్రివర్ణ పతాకాన్ని తప్పుగా పట్టుకున్నారు.

Nora Fatehi: జాతీయ పతాకాన్ని అవమానించిన నోరా ఫతేహి…
ఇలా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి నోరా ఫతేహి కంగారులో జాతీయ పతాకాన్ని తలకిందులుగా పట్టుకోవడం సంచలనంగా మారింది. ఇలా వేదికపై జాతీయ జెండాను కించపరుస్తూ ఈమె వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జాతీయ పతాకాన్ని అవమానించినందుకు ఈమె క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

































