Cinema: అలనాటి అందాల తార పూర్ణిమ గురించి తెలియని వారుండరు. అప్పటి జనరేషన్ కి ఆమె సుపరిచితురాలు. ఆలీ వ్యాఖ్యతగా సాగే ‘ఆలీలో సరదాగా’ షోకు హాజరమైన ఆమె తన కెరీర్ లోని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన కెరీర్లో జరిగిన ఘటనలను చెప్పుకొచ్చింది.

సినిమా రంగంలో పనిచేస్తున్నానని.. ఏ సంబంధం కుదరక పోయేదని ఆమె చెప్పుకొచ్చారు. తొలుత సింగర్ కావాలని సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టానని ఆమె అన్నారు. ఆయితే నటిగా మారాల్సి వచ్చిందని వెల్లడించారు.

తొలుత సప్తపది సినిమాకు అవకాశం వచ్చినా.. డ్యాన్స్ రాదని తెలిసి అందులోనుంచి తీసేశారని చెప్పారు. హీరోయిన్ గా తనపక్కన చేయమని దిగ్గజ హీరో అక్కినేని నాగేశ్వర రావు అడిగే వారని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్లో బెస్ట్ ఫిలిం ‘శ్రీవారికి ప్రేమలేఖ’ అని చెప్పారు పూర్ణిమ. ‘ మాపల్లెలో గోపాలుడు’ పాటను రాత్రి షూట్ చేశామని చెప్పుకొచ్చారు. ఈ పాట ఇప్పటికీ ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది.
అతను నన్ను నిజంగానే కొట్టేవాడు: పూర్ణిమ
‘మనిషికొక చరిత్ర’ షూటింగ్ సందర్భంగా నటుడు గొల్లపూరి మారుతీ రావు నిజంగానే తనని కొట్టారని పూర్ణిమ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం నటను దూరంగా ఉంటోంది పూర్ణిమ.. తమిళం, కన్నడ, తెలుగు, మళయాళ భాషల్లో నటించారు పూర్ణిమ. 2017లో వచ్చిన నితిన్ ‘లై’ సినిమాలో తల్లి పాత్ర చేసింది. తన కెరీర్లో బెస్ట్ ఫిలింగా శ్రీవారికి ప్రేమ లేఖ నిలిచింది. ఆ సినిమాకు గానూ ఆమె ఫిలిం ఫేర్ బెస్ట్ హీరోయిన్ గా నామినేట్ అయింది.































