Novak Djokovic: కరోనా కేసులు పెరుగుతున్నా కొద్ది కొన్ని దేశాలు ఇరు దేశాల ప్రయాణికులను అనుమతినివ్వడం లేదు. దీనిలో భాగంగానే టెన్నిస్ ప్లేయర్ నవోక్ జకోవిచ్ విషయంలో ఎదురైంది. అతడిని విమానాశ్రయంలోనే ఆపేశారు. అంతే కాదు అతడి వీసాను కూడా రద్దు చేశారు.

ఏం జరిగిందంటే.. ప్రతీ సంవత్సరం ఆస్ట్రేలియాలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ ఉన్న టెన్నీస్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే జనవరిలోనే ఈ టోర్నమెంట్ ఉంటుంది. వరుసగా టైటిల్స్ గెలుస్తున్న నవోక్ జకోవిచ్ కు ఇది ఒక సెంటిమెంట్ లాంటిది.

అతడు… ప్రత్యేక మినహాయింపుతో ఆస్ట్రేలియలో అడుగుపెట్టారు. అయితే అక్కడ నవోక్ జకోవిచ్ ను అధికారులు నిలిపివేశారు. అంతే కాదు అతడి వీసాను కూడా రద్దు చేశారు. మినహాయింపు ఇస్తేనే వచ్చానని గట్టిగా వాదిస్తున్నా.. వాళ్లు వినిపించుకోలేదు. అయితే అతడు అక్కడ నుంచి వెళ్లకుండా న్యాయపోరాటానికి దిగాడు.
అప్పీల్‌ను సోమవారం విచారించనున్నట్లు వెల్లడి..
ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో పంచుకోగా.. అతడి అభిమానులు అండగా నిలిచారు. 34 ఏళ్ల అతను ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోని కార్ల్‌టన్‌లోని పార్క్ హోటల్‌లో ఒంటరిగా ఉన్నాడు. ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ (ABF) తన ఎంట్రీ వీసాను రద్దు చేసి అతనిని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్ ఫలితం కోసం వేచి చూస్తున్నాడు. ఈ అప్పీల్‌ను సోమవారం విచారించనున్నట్లు స్కై స్పోర్ట్స్ నివేదిక తెలిపింది. అతడికి సపోర్టుగా నిలుస్తున్న. అభిమానులు, సన్నిహితులు, తల్లిదండ్రులు అతనికి గుండెధైర్యాన్నిచ్చేలా పోస్టులు పెట్టారు. తనకు మద్దతు తెలపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సెర్బియా ఆటగాడు నవోక్ జకోవిచ్.





























