సాధారణంగా చాలా మందికి డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో ఉంటారు. అలాంటి వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ అందిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే కోటీశ్వరులు కావచ్చు. అయితే ఈ కాంటెస్ట్ లో పాల్గొనటానికి మనకు ఎలాంటి ఖర్చు లేదు. మరి ఇంకెందుకాలస్యం అసలు విషయంలోకి వెళ్దాం…

ఇండియన్ ఆయిల్ తాజాగా ఓ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకం ప్రకారం మీరు కేవలం మీ బండికి 25 లీటర్ల డీజిల్ ఒకేసారి వేయించుకొని అందుకు సంబంధించిన బిల్లును పొందాలి. ఈ బిల్లు నంబర్ SMS పంపింస్తే చాలు ఏకంగా రెండు కోట్ల రూపాయలను గెలుచుకోవచ్చని ఇండియన్ ఆయిల్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ @IndianOilcl లో తెలిపింది.
ఈ విధంగా ఇండియన్ ఆయిల్ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ప్రతి వారం, ప్రతి రెండు వారాలకు ఒకసారి ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. ఈ ప్రైస్ మనీ పొందాలంటే మీరు డీజిల్ వేయించుకున్న తరువాత చిన్న ఎస్ఎంఎస్ చేయాల్సి. డీలర్ కోడ్ ఇచ్చి స్పేస్ ఇచ్చి… ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి బిల్ నెంబర్ వేసి తరువాత స్పేస్ ఇచ్చి ఎంత డీజిల్ పోయించుకున్నారు అనేది తెలిపి 77990 33333కి మెసేజ్ పంపించాలి.
అయితే ఈ విధమైన ప్రైజ్ మనీ పొందడానికి కేవలం భారతీయులు మాత్రమే అర్హులు. ఒకే రోజు రెండు వేరు వేరు వాహనాలలో రెండు బిల్లులను తీసుకొని కూడా ఎస్ఎంఎస్ పంపవచ్చు. అయితే కేవలం ఇండియన్ ఆయిల్ బంకులలో మాత్రమే డీజిల్ వేయించుకోవాలి. ఈ ప్రైస్ మనీ కాంటెస్ట్ లో పాల్గొనే వారి వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఈ ఆఫర్ ఏప్రిల్ 4న మొదలు కాగా.. జులై 31 అర్ధరాత్రి 12 గంటల వరకు వచ్చే ఎస్ఎంఎస్ లను పరిగణలోకి తీసుకోనుంది.































