Viral Video: సాధారణంగా మన ఇంట్లో తల్లిదండ్రులు వంట గదిలో చాలా రకాల పోపు డబ్బాలను అమర్చుకుంటారు. ఈ పోపు డబ్బాలో వంటలకు కావాల్సిన అనేక రకాల పదార్థాల స్టోర్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఉపయోగపడని ఎటువంటి డబ్బాను అయినా పోపు డబ్బా రూపంలో ఉపయోగపడేలా చేసుకుంటారు.

ఇదే క్రమంలో ఒక ఎన్నారై మహిళ నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. ఆమె పేరు అర్షియా మూర్జానీ ఈమె అమెరికాలో ఉంటూ బిజినెస్ రంగాన్ని కొనసాగిస్తుంది. ఇక ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ డోరు తెరిచి గోదావరి అల్లం పేస్టు డబ్బాను బయటికి తీసింది. ఇక అందరూ దాంట్లో అల్లం పేస్ట్ ఉంటుందని అనుకున్నారు.

కానీ దాంట్లో దోసెల పిండి స్టోర్ చేసుకుంది. ఆ పిండిని పెనం పై వేసుకొని ఒక దోస తయారు చేసుకొని తినేసింది. అంతేకాకుండా మా కుటుంబం ప్రతీదాన్ని రీసైక్లింగ్ చేస్తుంది. అల్లం పేస్టు డబ్బాలో ఉన్నది దోశ పిండి కొన్ని రోజుల క్రితం నా చెల్లి ఫ్రిజ్లో పెట్టి ఉంచింది. నేను కూడా మొదట అల్లం పేస్ట్ ఏమో అని కన్ఫ్యూజ్ అయ్యాను.
చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది..
తర్వాత నాకు అర్థమైంది. మా ఫ్యామిలీ ఇలా ప్రతి ఒకటీ దేనికో దానికి ఉపయోగపడేలా చేయడం నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుందని మూర్జానీ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక మీరూ ఓ లుక్కేయండి.



























