Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే నటనకు మారుపేరు అనే విషయం అందరికీ తెలిసిందే.సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన కంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం జాతీయ స్థాయి హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ గురించి మనకు కేవలం నటుడిగా మాత్రమే తెలుసు. కానీ ఎన్టీఆర్ లో మరొక యాంగిల్ కూడా దాగి ఉంది.

నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో బాడ్మింటన్ ప్లేయర్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని తాజాగా ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. తాజాగా ఎన్టీఆర్
గల్ఫ్ మీడియాకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన తల్లి చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకొమ్మని చెప్పారు. అలా తల్లి చెప్పిన విధంగా కూచిపూడి నేర్చుకుని కూచిపూడి డాన్సర్ గా మారిపోయాను. అలాగే మా అమ్మ నన్ను క్రీడలలో ప్రోత్సహించింది. నేను నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యాను అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తారక్ మల్టీ టాలెంటెడ్…
ఇలా నేను ఊహించిన విధంగా కాకుండా నటుడిగా అందరికీ పరిచయమయ్యాను. ఇలా ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన తల్లి పై ఉన్న ప్రేమను వ్యక్తపరచడమే కాకుండా తాను నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే విషయాన్ని కూడా బయటపెట్టడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులలో ఎన్టీఆర్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఎంతైనా ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ అంటూ తమ అభిమాన నటుడు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.



























