యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమాలో కొమరం భీమ్ అనే పాత్రలో నటించారు.ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజమౌళి RRR సినిమా పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలియజేశారు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోని సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటించిన రామ్ చరణ్ తన తదుపరి చిత్రం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ సినిమా ఇప్పటివరకు పట్టాలేక్కకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటి అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ RRR సినిమాలో అధిక శరీర బరువు పెరిగారు. కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా తన శరీర బరువు తగ్గాల్సి ఉందని చెప్పడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై ప్రసారమౌతున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ తన శరీర బరువును తగ్గిన తదుపరి ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈ సినిమాపై అభిమానులు మరింత అంచనాలు పెట్టుకున్నారు.































