సినిమా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘RRR’. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఇప్పటికే విడుదల కావలసింది.. కానీ గత ఏడాది కరోనా వచ్చి షూటింగ్‌ ఆగిపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు. మళ్లీ షూటింగ్ మొదలై జోరుగా పని నడిచాక చిత్ర బృందంలో కాన్ఫిడెన్స్ వచ్చింది.

అక్టోబరు 13న రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చారు.ఈసారి బాగా ఆలోచించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే విడుదల తేదీ ప్రకటించారు. కానీ ఆ డేట్ ఇచ్చాక పరిస్థితులు మళ్లీ ఇబ్బందికరంగా తయారయ్యాయి. షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం సాగలేదు. ఆలియా కరోనా బారిన పడటం సహా వేరే కారణాలు తోడయ్యాయి. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ కూడా వచ్చి పడింది. షూటింగ్ ఆపేయక తప్పలేదు.చిత్ర బృందం ప్రకటించిన విడుదల తేదీకి ఇంకో ఐదు నెలలే మిగిలున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.

అది అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. వివిధ భాషలకు డబ్బింగ్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో అక్టోబరు 13 అనే కాదు.. ఈ ఏడాది చివరికి కూడా ‘ఆర్ఆర్ఆర్’ రాకపోవచ్చనే అభిప్రాయంతోనే అందరూ ఉన్నారు. కానీ ఈ చిత్ర కథానాయకుల్లో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయడంపై ఆశావహ దృక్పథంతో ఉండటం విశేషం.’డెడ్ లైన్’ అనే అంతర్జాతీయ పబ్లిషింగ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ విశేషాలపై తారక్ మాట్లాడాడు.

ఈ సినిమాకు సంబంధించి తమ ప్రయాణం 2018 నవంబరులో మొదలైందని.. ఐతే కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు తాము పని మానేసి ఖాళీగా ఉండాల్సి వచ్చిందని.. ఆ సమయాన్ని మినహాయిస్తే ఇప్పటిదాకా 19 నెలల పాటు ఈ సినిమా మీద పని చేశామని తారక్ తెలిపాడు.’ఆర్ఆర్ఆర్’ ప్రమాణాల ప్రకారం చూస్తే ఇంత సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదని.. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ ఘట్టాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని తారక్ అన్నాడు. అక్టోబరులో ఈ సినిమాను రిలీజ్ చేయడం పట్ల తాము ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు తారక్ చెప్పడం విశేషం….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here