NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తుంది.ఇక డైరెక్టర్ ప్రశాంత్ జూన్ 4వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్ సెట్ లో ప్రశాంత్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. అదేవిధంగా రామ్ చరణ్ సైతం సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన ఫ్యామిలీ కోసం ఈయన ఒక డెలిషియస్ డిష్ పంపించి సర్ప్రైజ్ చేశారు.ప్రశాంత్ బర్త్ డే సందర్భంగా తన ఫ్యామిలీ కోసం ఎన్టీఆర్ నాటుకోడి పులుసు పంపించి వారిని సర్ప్రైజ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ప్రశాంత్ భార్య లిఖిత రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

NTR: నాటుకోడి పులుసు…
ఈ సందర్భంగా లిఖితారెడ్డి నాటుకోడి పులుసుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ థాంక్యూ సో మచ్ అన్నయ్య అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలపరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ప్రశాంత్ ఎన్టీఆర్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అనే విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలియడంతో సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు కూడా పెరిగిపోయాయి.



























