Sr.NTR: సూర్యకాంతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు నటిస్తున్న సమయంలో గయ్యాళి అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా సూర్యకాంతం ఉండేవారు.ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో గయ్యాళి అత్త పాత్రలో నటించి పెద్ద ఎత్తున సందడి చేశారు.అయితే ఈమె కేవలం సినిమాలలో మాత్రమే గాయ్యాలిగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఎంతో సౌమ్యురాలు.

ఇకపోతే సూర్యకాంతం నిజ జీవితంలో ఎన్నో కుటుంబాచార వ్యవహారాలను పాటిస్తూ ఉండేవారు. ఇక ఈమె భర్త కేవలం ఇంటి భోజనం అది కూడా సూర్యకాంతం చేసిన భోజనం మాత్రమే ఎంతో ఇష్టంగా తినేవారు. దీంతో ఈమె ఇంట్లోనే వంట కార్యక్రమాలన్నింటిని పూర్తిచేసుకుని షూటింగ్ వచ్చేది.అయితే ఒకానొక సమయంలో దాదాపు పది సంవత్సరాలపాటు క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలలో సూర్యకాంతం నటిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇంట్లో వంట చేయడానికి వీలుపడకపోవడంతో తన భర్తను ఒప్పించి అప్పట్లో ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉన్నటువంటిరేలంగి వెంకట్రామయ్య ఎన్టీఆర్ సూచన మేరకు విజయవాడకు చెందిన ఒక బ్రాహ్మణ అమ్మాయిని తన ఇంట్లో పనిమనిషిగా నియమించారు అయితే ఆ బ్రాహ్మణ అమ్మాయి ఎవరింటికి ఏంటి అని అడగకుండా మద్రాసు ట్రైన్ ఎక్కి రైల్వే స్టేషన్ లో దిగారు.

Sr.NTR: సూర్యకాంతం పేరు చెప్పగానే పారిపోయిన వంట మనిషి…
ఇక ఆమెను రిసీవ్ చేసుకోవడానికి కారు పంపించగా తీర కారు ఎక్కే సమయంలో నేను ఎవరింట్లో పని చేయాలని అడగ్గా సూర్యకాంతం అని పేరు చెప్పగానే ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తిరిగి విజయవాడ ట్రైన్ ఎక్కి వెళ్లిపోయారు. ఇక ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ మన సూర్యకాంతం అత్తకు ఇంత పేరు ఉంది అంటూ ఆట పట్టించేవారు. అయితే ఇక ఆమె ఇబ్బంది పడుతున్న సమయంలో స్వయంగా ఎన్టీఆర్ తన ఇంట్లో వంట చేయడం కోసం ఒక పని మనిషిని నియమించారంటూ గుమ్మడి తన పుస్తకంలో వ్రాసుకొచ్చారు.































