ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు అందరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా తమ మార్కెట్ ను పెంచుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలోనే హీరోలు పాన్ ఇండియా సినిమాలను పెంచుకుంటున్నారు. ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న కారణంగా తన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొనిబాషతో సంబంధం లేకుండా అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి హీరోలు బాలీవుడ్ కి పరిచయమైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కూడా వీరి కోవలోకే చేరబోతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి పరిచయం కానున్నారు.
ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారట. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో గట్టిగా ప్రమోషన్స్ చేయడానికి చెర్రీతో పాటు తారక్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇటీవల తారక్ చేతికి గాయం అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ ఆ సమయాన్ని ఇలా సద్వినియోగం చేయాలని చూస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే కొరటాల సినిమాను కూడా కొద్దిగా వెనక్కి జరిపినట్లు సమాచారం.





























