NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పిఠాపురం తెలుగుదేశం అభ్యర్థి వర్మ చేసినటువంటి సంచలనంగా మారాయి. ఇటీవల ఒక న్యూస్ డిబేట్ లో పాల్గొన్నటువంటి ఈయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ…ఎన్టీఆర్ కూడా తన సినిమాలను వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి వస్తే తనకు ఏదైనా ఒక పదవి ఇప్పిస్తామని తెలిపారు.

ఎన్టీఆర్ లోకేష్ ఇద్దరి గురించి వర్మ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ప్రజల కోసం పనిచేస్తున్నారని ప్రజల కోసమే పాదయాత్ర చేయడమే కాకుండా కొన్ని లక్షల మందికి సభ్యత్వం కల్పించారని తెలిపారు. అలాగే ఎవరైనా కార్యకర్త చనిపోతే వారికి ఇన్సూరెన్స్ ఇచ్చే పద్ధతిని కూడా లోకేష్ తీసుకువచ్చారు.
నిత్యం ప్రజలలో ఉన్న వారిని రాజకీయ నాయకులు అంటారని భయపడి ఇంట్లో కూర్చుంటే అలాంటి వారిని రాజకీయ నాయకులు అనరు అంటూ పరోక్షంగా ఎన్టీఆర్ గురించి వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. నందమూరి కుటుంబంలో హరికృష్ణ గారు అలాగే బాలకృష్ణ గారు కూడా రాజకీయాలలో ఉన్నారు. వారికి రాజకీయాలలోకి రావడం తెలుసని, ఎన్టీఆర్ కూడా పూర్తిగా సినిమాలో వదిలేసి రాజకీయాలలోకి వస్తే తనకి కూడా కీలక పదవి ఇప్పిస్తామని తెలిపారు.
నీకే టికెట్ లేదు..
ఇలా వర్మ ఎన్టీఆర్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.వర్మకే ఏపీ టీడీపీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నీకే టికెట్ లేదు నువ్వేం పదవి ఇప్పిస్తావ్ అంటూ వర్మపై సెటైర్లు వేశారు. ఇక ఎన్టీఆర్ సినిమాలు మానేసి రాజకీయాలలోకి రమ్మంటున్నారు అలాంటప్పుడు రాజకీయాలలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు సినిమాలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.





























