తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, అందాల తార సుస్రత్ మొదటి నుంచి కూడా వివాదాలకు కేంద్రంగా మారుతుంది. బెంగాలీ ముస్లిం అయిన ఆమె నిఖిల్ జైన్ అనే బిజినెస్ మ్యాన్ ను 2018 లో ప్రేమించి, 2019లో హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. నుస్రత్ వివాహం అప్పట్లో సంచలనం రేపింది.

ఇక ఈమె లోక్ సభకు నుదుట బొట్టు పెట్టుకొని వెళ్లడంపై ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అప్పట్లో ఇది కూడా పెద్ద సంచలనంగా మారింది. ఇటీవల ఆమె తన భర్తతో దూరంగా ఉంటుంది.వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా విభేదాలు రావడంతో 2020 నవంబర్ నుంచి దూరంగా ఉంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. దాదాపు రెండు నెలల క్రితం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కోల్ కత్తాలోని నియోతియాలో సిజేరియన్ ద్వారా ఆమె బిడ్డను కనింది.
ఆమె గర్భం దాల్చిన సమయంలో నుస్రత్ భర్త.. నిఖిల్ ఆమె ప్రెగ్నెన్సీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్లు సంచలనం స్పష్టించాయి. ఈ క్రమంలో.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనే అంశంపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఇక బిడ్డ పుట్టాక సైతం నుస్రత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది.
అయినా ఆమె నోరు విప్పలేదు. తాజాగా తన కుమారుడి జనన ధృవీకరణ పత్రంలో తన భాగస్వామి పేరుగా నటుడు యష్ దాస్ గుప్తా పేరును చేర్చడంతో విమర్శలకు తెరపడినట్లైంది. ఆమె భర్తతో విడిపోయిన దగ్గర నుంచి ఆమె తన స్నేహితుడు యష్ దాస్ గుప్తాతో సన్నిహితంగా ఉంటోంది. ఆమెకు బిడ్డ పుట్టగానే గుప్తా కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆమె కూడా ఓ కేక్ పై తన భర్త యష్.. తన బిడ్డకు తండ్రి కూడా అతడే అంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో భాగస్వామి ఎవరో అందరికీ తెలిసిపోయింది.































