[వైరల్ వీడియో..] ఓం కరోనా ఫట్, ఫట్ స్వాహా అంటూ..! వామ్మో..

0
121

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులందరూ కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలలో కర్ఫ్యూ విధించి వైరస్ కట్టడి కోసం తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఎంత కఠినమైన చర్యలు తీసుకోనైనా వైరస్ కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు.లాక్ డౌన్ అమలు విషయంలో అధికారులు తలలు పట్టుకోగా మరి కొందరు మాత్రం మంత్రాలతో కారోనాను తరిమి కొడతామని రంగంలోకి దిగారు.

తాజాగా, ఓ మంత్రగాడు కరోనాను తరమటానికి ఏకంగా కరోనా వార్డులో పూజలు నిర్వహించాడు. ‘ఓం కరోనా ఫట్‌, ఫట్‌, ఫట్‌.. స్వాహా..’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చదవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మంత్రగాడు మంత్రాలు చదవడం వల్ల కరోనా పారిపోవడం ఏమోగానీ ఆయన చదివే మంత్రాలు మాత్రం బాగా పాపులర్ అవుతున్నాయి.

కరోనా పారిపోవాలనే మంత్రగాడు చేస్తున్నటువంటి మంత్ర పూజలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోను బాలీవుడ్‌ ఫొటోగ్రాఫర్‌ వరిందర్‌ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో “గో కరోనా గో 2.0’ అనే శీర్షికను జత చేశాడు. ఈ వీడియో ఇప్పటివరకు 42 షేర్‌ చేశాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించి కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అనే విషయాలు తెలియడం లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here