కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం లోని పెద్ద అవుట పల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఈ నేపధ్యంలో ఉంగటూరు మండలం పొట్టిపాడు గ్రామ నివాశితులైన దోమ రఘుబాబు, రాణి దంపతులు బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుల మంతు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరినీ విజయవాడ పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రఘుబాబు మృతి చెందాడు. గతంలో రఘుబాబు పోస్ట మాస్టర్ గా పని చేశాడని తెలుస్తుంది. ఈ క్రమంలో అతని పై కొన్ని ఆరోపణలు రావడంతో పోస్ట్ మాస్టర్ విధుల నుంచి సస్పండ్ చేశారు.































