చాక్లెట్ లో బీఫ్ కలుపుతారా.. అసలు నిజం ఏంటి?

0
366

చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాక్లెట్లు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ గురించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డైరీ మిల్క్ చాక్లెట్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న క్యాడ్బరీ చాక్లెట్స్ తయారీలో బీఫ్ (గొడ్డు మాంసం) కలుపుతారనే ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో పలువురు ఈ కంపెనీ పై వ్యతిరేకంగా కంపెనీ తయారుచేసే చాక్లెట్లు నిషేధించాలని పిలుపునిచ్చారు. నిజంగానే చాక్లెట్ లో బీఫ్ కలుపుతారా.. అసలు నిజం ఏమిటో కంపెనీ యజమాని వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా క్యాడ్బరీ చాక్లెట్ యజమాని మోండలేజ్ మాట్లాడుతూ.. మేము తయారు చేసే ఉత్పత్తులలో కొన్నింటిలో జెలటిన్ ఉంటుంది. ఈ జెలిటిన్ హలాల్ చేసిన బీఫ్ నుంచి తీసుకున్నాం అనే సమాచారాన్ని స్క్రీన్ షాట్ తీసి కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి మా కంపెనీ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చాక్లెట్ తయారీలో ఉపయోగించే జెలటిన్ బీఫ్ నుంచి తీసుకుంటే అందులో బీఫ్ వేసినట్టేనని మా ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఈ పోస్టులు పెడుతున్నారు.

నిజానికి మేము తయారుచేసే ఉత్పత్తులలో ఎలాంటి మాంసాహారం ఉపయోగించము. 100% శాకాహారమే. మా కంపెనీ ఉత్పత్తి చేసే చాక్లెట్ కవర్ పై ఆకుపచ్చని బిందువు అందుకు అందుకు నిదర్శనమని సదరు సంస్థ వివరణ ఇచ్చింది. అనవసరంగా లేనిపోని విషయాలను కల్పించి చెప్పేముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా
మోండలేజ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here