Actress Suchitra: నటి సుచిత్రా కృష్ణమూర్తి 1991లో వచ్చిన మలయాళ చిత్రం ‘కిలుక్కింపెట్టి’తో జయరామ్ సరసన నటించి వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళ శివరంజని సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన ఈమె షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్‌బాత్ ఆగ్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె కేవలం నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా పేరు సంపాదించుకున్నారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ కియారా అద్వానీ జంటగా నటించిన ‘భూల్ భులయా 2’, అదేవిధంగా ‘గిల్టీ మైండ్స్’ వెబ్ సిరీస్‌లో నటించింది.తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న సుచిత్ర తన గురించి తన కూతురు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

నటి సుచిత్ర దర్శకుడు శేఖర్ కపూర్‌ను వివాహం చేసుకున్న ఎనిమిదేళ్లకు తన భర్తకు విడాకులిచ్చి విడిపోయారు. వీరిద్దరికీ కావేరి కపూర్ అనే కూతురు కూడా ఉన్నారు. ఇలా తన కూతురుతో కలిసి ఒంటరిగా గడుపుతున్న నటి సుచిత్రను ఇతరులతో డేటింగ్ చేయమని తన కూతురు తనని బలవంతం చేసిందని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ న్యూస్ చెప్పారు. కన్న కూతురే డేటింగ్లో పాల్గొనమని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఎన్నో అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చేవి…
తనకు తెలియకుండా తన కూతురు డేటింగ్ యాప్ లో తన డీటెయిల్స్ నమోదు చేసి డేటింగ్ చేయమని బలవంతం చేస్తుంది. అయితే తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉండగా అతను కూడా తనని మోసం చేశాడని, ఇప్పుడు తాను ఉన్నది ఇతరులతో డేటింగ్ చేయడం కోసం కాదు అని తన కూతురుకు అర్థమయ్యేలా వివరించానని తెలిపారు. ఈ క్రమంలోనే డేటింగ్ యాప్ లో తన వివరాలు నమోదు చేయడం వల్ల తనకు ఎన్నో అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చేవి దీంతో తన కూతురే స్వయంగా తన డీటెయిల్స్ అన్ని తొలగించిందని ఈ సందర్భంగా సుచిత్ర కృష్ణమూర్తి వెల్లడించారు.

































