Pallavi Prashanth: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచారు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. ఇలా బిగ్ బాస్ చరిత్రలోనే ఒక కామన్ మ్యాన్ కప్పు గెలవడం మొదటిసారి కావటం విశేషం. ఇలా ఈయన విజేత కావడంతో ఈయనకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొంటారనే సంగతి మనకు తెలిసిందే.

ఈసారి ఈ కార్యక్రమానికి గీతూ రాయల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పల్లవి ప్రశాంత్ ని ప్రశ్నిస్తూ అసలు బిగ్ బాస్ రావడం వెనుక కారణం ఏంటి అని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ చాలామంది తనను చీప్ గా చూశారని అందుకే తాను ఏంటో నిరూపించుకోవడం కోసమే బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చాను అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
తనకు వ్యవసాయ పనులు చేయడం ఆ పంటను హైదరాబాద్ కూకట్ పల్లి మార్కెట్ కు తరలించడం మాత్రమే తెలుసు. నాకు హైదరాబాదులో కూకట్ పల్లి మార్కెట్ తప్ప మరి ఏమి తెలియదని ఈయన తెలిపారు. అయితే ఒకసారి మా నాన్నను ఒక వ్యక్తి మీ అబ్బాయి ఏం చేస్తాడు అంటూ అడిగారు పొలం పనులు చేస్తాడని బాయికాడ పనులు చేసుకుంటారని చెప్పారు.
500 తో హైదరాబాద్ వచ్చాను…
పొలం పనులు చేస్తానని చెప్పడంతో ఆ వ్యక్తి చాలా చీప్ గా చూసారు దాంతో నాకు చాలా బాధ కలిగిందని బాయికాడ పనులు చేసే వాళ్ళు ఏమీ సాధించలేరా అనే ఆలోచన నన్ను బిగ్ బాస్ వరకు తీసుకువచ్చిందని పల్లవి ప్రశాంత్ తెలిపారు. నేనేంటో నిరూపించుకోవడం కోసం నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను నాన్న అంటూ 500 రూపాయలు చేతిలో పట్టుకొని హైదరాబాద్ వచ్చానని ఈ సందర్భంగా ఈయన తనని కొందరు చీప్ గా చూడటంతోనే తనని తాను ప్రూఫ్ చేసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చానని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























