Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే టాగ్ వేసుకుని ఈయన ఎన్నో వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి విషయాలను సోషల్ మీడియా వేదికగా వీడియోల రూపంలో తెలియజేస్తూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయనకు వచ్చినటువంటి గుర్తింపు కారణంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా తన ఆట తీరుతో ఆకట్టుకున్నారు అలాగే కొన్నిసార్లు సింపతి డ్రామాలు కూడా ప్లే చేసి ఓట్లు సంపాదించారు.

అచ్చం రాజకీయ నాయకుల తరహాలోనే ఈయన కూడా ఓట్లు కోసం భారీగా హామీలు కూడా ఇచ్చారు. తాను డబ్బు గెలిస్తే కచ్చితంగా ఆ డబ్బును రైతు కుటుంబాలకు ఇస్తానని ఆపదలో ఉన్నటువంటి రైతులకు అండగా నిలుస్తానని చెప్పారు. ఇలా కప్పు గెలవడానికి ముందు ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కప్పు గెలిచిన తర్వాత మాట మార్చి మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు.
కప్పు గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మీరు మీ చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఇదివరకు ఏదైనా సహాయం చేశారా అంటూ ప్రశ్నలు వేయగా వెంటనే ఈయన నేనేమైనా సీఎం అనుకుంటున్నారా అందరికీ సహాయం చేయడానికి అంటూ కామెంట్ చేశారు దీంతో ఈ వ్యాఖ్యలపై చాలామంది భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
అసలు రంగు బయటపెట్టిన పల్లవి ప్రశాంత్..
కప్పు గెలిచే వరకు రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించినటువంటి ఈయన గెలిచిన తర్వాత రైతులకు సహాయం చేయడానికి వెనకాడుతున్నారని మాట మారుస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. గెలిస్తే రైతులకు డబ్బు ఇస్తానని ఆశ చూపి ఓట్లు పడేలా చేసినటువంటి ప్రశాంత్ గెలిచిన తర్వాత మాట మార్చడంతో ఈయన అసలు రంగు బయటపడింది అంటూ పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

































