Panchumarthi Anuradha : ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన మహిళా నేత తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ. అతి చిన వయసులోనే నగర మేయర్ ఎన్నికై లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సి ఎన్నికలలో టీడీపీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సి అభ్యర్థిగా విజయం సాధించి వైసీపీ నాయకులకు షాక్ ఇచ్చింది. టీడీపీ కి ఉన్న బలం చూసుకుంటే ఆమె గెలవడం కష్టమే అయినా ఆమె గెలిచి అందునా రావాల్సిన ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువే సంపాదించి మొత్తం 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సి గా ఎన్నికైంది. దీంతో ఆమె ప్రస్తుతం హాట్ టాపిక్ ఏపీ రాజకీయాల్లో నిలిచారు.

అనురాధ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి…
పంచుమర్తి అనురాధ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ 2000 సంవత్సరంలో విజయవాడ నగర మున్సిపల్ ఎన్నికల సమయంలో బీసీ మహిళ కోసం చూస్తుండగా పార్టీ ఆఫీస్ కి వెళ్లి దరఖాస్తు ఇచ్చి నిలబడింది. ఆ ఎన్నికల్లో గెలుపొందడం అలాగే అతి చిన్న వయసులోనే నగర మేయర్ అవ్వడం జరిగింది.

26 ఏళ్ల వయసులో నగర మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు అనురాధ. ఇక ముస్సోరి లాల్ బహదుర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీలో ఆహ్వానం మీద వెళ్లి అక్కడ వారికి లెక్చర్స్ ఇచ్చారు. అంతేకాకుండా టీడీపీ ప్రధానకార్యదర్శిగా అలాగే టీవీ డిబేట్స్ లో పాల్గొంటూ జనాల్లో మంచి ప్రాచుర్యం పొందిన ఆమె 2016 లో క్యాన్సర్ తో పోరాడి గెలిచారు. ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె ఎమ్మెల్సీ గా గెలిచి సంచలనం సృష్టించారు.