కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే బయటకు వెళ్లే ప్రతిసారి మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, హ్యాండ్ శానిటైజర్ లు వేసుకోవడం మన రోజువారి దినచర్యలో భాగమయ్యాయి. బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తూ బయటకు వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి సమయంలో పుట్టిన పిల్లలకు బొమ్మలకు బదులుగా శానిటైజర్ బాటిల్ ను పట్టుకోవడం అలవాటుగా మారిపోయింది.కరోనా సమయంలో పుట్టిన పిల్లలు వారికి అవగాహన వచ్చినప్పటినుంచి వారి తల్లిదండ్రులు మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ లు వాడటం చూసి పిల్లలు సైతం తల్లిదండ్రులనే అనుసరిస్తున్నారు.
సాధారణంగా చిన్న పిల్లలు వారి తల్లిదండ్రులను అనుకరించి వారు చేసే పనులను చేయడం సర్వసాధారణం.ఇక కరోనా సమయంలో పుట్టిన పిల్లలు అయితే మరీ ఎక్కువగా తమ తల్లిదండ్రులను అనుసరించి మాస్కులు, శానిటైజర్ లను తెగ వాడుతున్నారు. ఈ క్రమంలోనే 2020 సంవత్సరంలో పుట్టిన ఓ బేబీ మాత్రం విపరీతంగా శానిటైజర్ లను ఉపయోగిస్తుంది.విచిత్రమేమిటంటే ఈమె శానిటైజర్ వేసుకోకపోయినా చేతులను శుభ్రపరచుకుంటూ వెళ్ళటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఈ క్రమంలోనే ఈ చిన్నారి శానిటైజర్ లు వాడటానికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఈ చిన్నారి కనిపించిన ప్రతి వస్తువు కింద చెయ్యి పెట్టి శానిటైజర్ రుద్దుకుంటూ ఉన్నట్లు భావిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు సూపర్ బేబీ అంటూ కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ఇలా కరెంట్ స్విచ్ బోర్డ్ కింద వేలు పెడితే కొన్ని సార్లు ప్రమాదాలు కూడా తలెత్తవచ్చు పిల్లల పట్ల జాగ్రత్త ఎంతో అవసరం కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























