Paper Leak: తెలంగాణ పేపర్ లీక్ కేసులో భారీ ట్విస్ట్… అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడిన ప్రవీణ్!

0
65

Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో గంటకొక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇలా ఈ కేసు విషయంలో ప్రవీణ్ సూత్రధారిగా పోలీసులు గుర్తించే ఆయనను విచారిస్తున్న నేపథ్యంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈయన వ్యవహారం బయటపడటంతో పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. 2017లో టీఎస్‌పీఎస్‌సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన ప్రవీణ్.. వెరిఫికేషన్ సెక్షన్‌కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదురు మహిళలతో చాలా చనువుగా ఉండేవారు.

ఇలా ఎంతోమంది మహిళలను ట్రాప్ చేసి వారితో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈయన ఫోన్లో వందల కొద్ది మహిళల ఫోన్ నెంబర్లు వాట్సాప్ చాటింగ్ లో నగ్న వీడియోలు చూసి ఒక్కసారిగా పోలీసులు తలలు పట్టుకున్నారు.ఈయన పేపర్ లీక్ ముందు ఏకంగా 46 మంది అమ్మాయిలతో ఫోన్లో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

కేసు దర్యాఫ్తు సిట్ చేతికొచ్చాక విచారణ వేగవంతం అయ్యింది. అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్లు పోలీసులుగుర్తించారు అయితే ఇలాంటి ప్రతిఫలం లేనిదే వీళ్ళు కూడా ఇలాంటి సాహసానికి వడగట్టి ఉండరని బహుశా వీరికి కూడా ప్రశ్నాపత్రం లీక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఇక ఈయనతో పాటు లీకేజ్ విషయంలో పాలుపంచుకున్నటువంటి టీచర్ రేణుక సెలవులు కూడా పెద్ద ఎత్తున అనుమానాలకు దారి తీస్తున్నాయి.

Paper Leak: పేపర్ లీకేజీ రోజున సెలవు పెట్టిన రేణుక…


వనపర్తి మండలం బుద్ధారం ఎస్‌సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పని చేస్తున్నటువంటి రేణుక ఈ నెలలో 12 సెలువులు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈనెల 4 5వ తేదీలలోతమ బంధువు చనిపోయారని ఈమె సెలవు పెట్టింది అయితే అదే తేదీలలో పేపర్ లీక్ కావడంతో పోలీసులు సరికొత్త అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ పేపర్ లీకేజ్ విషయం ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో తెలియాల్సి ఉంది.