ఏ తల్లిదండ్రులకు అయినా.. తన పిల్లలు చెడిపోతుంటూ చూస్తూ ఊరుకోరు. నాలుగు దెబ్బలు తగిలించైనా.. వాళ్లకు బుద్ది చెబుతారు. ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఓ యువకుడు ఫోర్న్ వీడియోలు చూస్తూ.. డబ్బులన్నీ ఖర్చు చేస్తున్నందుకు అతడి తల్లిదండ్రులకు కోపం వచ్చింది. అతడు తెచ్చుకున్న వీడియో కలెక్షన్లను మొత్తం నాశనం చేశారు.

దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఇంతకు ఆ కోర్టు తీర్పు ఏం చెప్పిందో తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లల్సిందే.. అమెరికాలోని ఇండియానాకు చెందిన డేవిడ్ వేర్కింగ్ అనే వ్యక్తి పోర్న్ వీడియోలకు బానిసగా మారాడు. కొన్ని రోజుల క్రితం పెళ్లి అయిన ఇతడికి వీడియోలు చూడటం అలవాటుగా మారింది. దీంతో అతడి భార్య వదిలేసింది.
ఒంటరిగా ఉంటున్న డేవిడ్.. వీడియోలు చూడటం మానకపోగా ఇంకా ఎక్కువగా చూసేవాడు. వాటిని సేకరించేందుకు భారీగా ఖర్చు కూడా చేశాడు. ఇలా అతడు వాటి కలెక్షన్ల కోసం సుమారు రూ.22.37 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఎలాగైన అతడిని ఆ ఊబి నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో అతడు సేకరించిన ఆ వీడియోలకు సంబంధించి వస్తువులను, కంప్యూటర్ లో సేవ్ చేసిన వీడియోలను అతడి తల్లిదండ్రులు నాశనం చేశారు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్డ్ పాల్ మలోని కొద్ది నెలల క్రితం కేసు దాఖలు చేసిన డేవిడ్ వేర్కింగ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. డేవిడ్ అనే వ్యక్తి తన సొంత డబ్బులతో ఆస్తి సంపాదించుకుంటే.. వాటిని వేరే వ్యక్తులు నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదంటూ తీర్పును వెలువరించింది. దీంతో అతడికి పరిహారంగా కోర్టు అతడి తల్లిదండ్రులను ఆ డబ్బులు చెల్లించాల్సిందిగా కోరింది.






























