Pawan Kalyan: ఏపీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ రాష్ట్ర రాజకీయాలపై చాలా ఉత్కంఠత నెలకొంది. ఇక రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒకవైపు ఉండగా పిఠాపురం ఎన్నికలు మాత్రం అందరిలోనూ తీవ్రస్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు.

తీరా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. ఇటీవలే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నటువంటి వైసీపీ కుట్రలకు తెర లేపిందని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ పేరిట మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. జనసేన పార్టీ నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా మరోవైపు కోనేటి పవన్ కళ్యాణ్ కనుమూరి పవన్ కళ్యాణ్ అనే మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు నామినేషన్ వేశారు. అయితే పవన్ కళ్యాణ్ గుర్తు గాజు గ్లాసు కాగా, మరో ఇద్దరు పవన్ కళ్యాణ్ గుర్తు కూడా అచ్చం గాజు గ్లాసును పోలి ఉండడంతో ప్రజలు అయోమయం పడే అవకాశాలు చాలా ఉన్నాయి.
పవన్ ఓటమి లక్ష్యమా..
ఇలా పవన్ కళ్యాణ్ పేరుతోనే అచ్చం ఆయన పార్టీ గుర్తును పోలి ఉన్నటువంటి గుర్తులతో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా వైసిపి కుట్రలో భాగంగా జరుగుతోందని, పవన్ కళ్యాణ్ ను ఓడించే దిశగా కుట్రలు చేస్తున్నారని తెలుస్తోంది.





























