Paruchuri Brother: రోజులు గడిచేకొద్దీ కాలం తో పాటు వయసు కూడా మీద పడటం అనేది సర్వసాధారణమైన విషయమే. ఈ విషయాన్ని సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా అంగీకరించక తప్పదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో వారు మేకప్ ల ద్వారా ఏజ్ ని కవర్ చేస్తూ వస్తుంటారు. అలా ఇండస్ట్రీలో వారు చాలా కాలం పాటు కనిపించకుండా పోయి ఒక్కసారిగా కనిపించేసరికి ముసలి తెరమీద పడినట్టుగా కనిపిస్తూ ఉంటారు.

అలా తాజాగా తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అలా కనిపించె సరికి షాక్ అయ్యారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలపాటు కథలు డైలాగులతో నటించిన పరుచూరి బ్రదర్స్ లో ఈయన పెద్దవారు. చిన్నవారు అయిన పరుచూరి గోపాలకృష్ణ గురించి కూడా మనందరికీ తెలిసిందే. వెంకటేశ్వరరావు ఒకవైపు ఏ జి ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూనే మరొక వైపు సినిమాలకు కథలు రాసేవారు. ఇక ఈ అన్నదమ్ములు ఇద్దరికీ పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేసింది నందమూరి తారక రామారావు.

అలా పరుచూరి బ్రదర్స్ గా వారిద్దరూ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యారు. దాదాపుగా మూడు వందల సినిమాలకు పైగా పని చేసిన ఎన్నో హిట్లు సూపర్ హిట్ల ను అందించారు. పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైన వెంకటేశ్వరరావు వయస్సు 80 ఏళ్లు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ బయటకు రావడం లేదు. ఇటీవల ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాంజీ పరుచూరి వెంకటేశ్వరరావును కలిసి పలకరించి ఆయనతో ఓ ఫోటో దిగారు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మానసిక స్థితి చురుగ్గా ఉంది…
గురువు గారు వెంకటేశ్వరరావును చూసి బాధపడ్డాను. కానీ దేవుడి దయవల్ల ఆయన మానసిక స్థితి ఎప్పటిలానే చురుకుగా ఉంది’ అని తెలిపారు. కానీ డైరెక్టర్ షేర్ చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో చూసి చాలామంది అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి గురువుగారూ ఇలా అయిపోయారు? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఆ ఫోటోని చూస్తూ బాధపడుతూ కామెంట్ చేస్తున్నారు

































