Paruchuri Gopalakrishna : ఫెయిల్యూర్స్ లేని డైరెక్టర్స్ అంటే రాజమౌళి తర్వాత టక్కున గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావిపూడి. అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకున్న అతికొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. చక్కటి కథకు సృజనాత్మకతను అద్ధితే విజయవంతమైన చిత్రాలను రూపొందించవచ్చని ఆయన నిరూపించారు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే.పవన్ కల్యాణ్ నటించిన “తమ్ముడు” చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు. 2005 లో విడుదలైన గౌతమ్ ఎస్.ఎస్.సి. చిత్రానికి సహాయకుడిగా పనిచేశాడు.

ఆ తర్వాత శౌర్యం, శంఖం, దరువు, సుడిగాడు చిత్రాలకు సంభాషణ రచయితగా.. కందిరీగ, ఆగడు, పండగ చేసుకో చిత్రాలకు కథా రచయితగా పనిచేశారు. ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో “పటాస్” చిత్రం ద్వారా మొదటిసారిగా అనిల్ రావిపూడి దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సాయి ధరంతేజ్ హీరోగా “సుప్రీం” రవితేజతో “రాజా ది గ్రేట్” ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వెంకటేష్, వరుణ్ తేజ్ తమన్నా మెహ్రిన్ హీరో హీరోయిన్లుగా F2 చిత్రాన్ని రూపొందించారు. అలా ఆ సినిమా విజయవంతం అయింది. ఆ విజయం దర్శక నిర్మాతలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది దానితో తిరిగి F2 కి సీక్వెల్ తీయాలనుకున్నారు.

ఆ క్రమంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు F3 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమా మే 27,2022న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే F3 సినిమా గురించి సీనియర్ సంభాషణల రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఎఫ్ త్రీ చిత్రంలో మురళీశర్మ కొడుకుగా వెంకీని చూపించడం బాగోలేదని.. వరుణ్ తేజ్, సునీల్ కొడుకులమంటూ రావడం లాంటి సీన్స్ అర్థం లేకుండా ఉన్నాయని, ఒకప్పుడు తాము శ్రీకృష్ణ లీలలు అనే చిత్రంలో చేసిన తప్పులే F3 లో దర్శకుడు చేసినట్లు అనిపిస్తుందని, అసలు వెంకి ఈ సినిమాలో ఆ పాత్రను ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదని పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు.


































