ప్రస్తుతం సోషల్ మీడియా బాగా డెవలప్ కావడంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఉపయోగించుకొని తమలో ఉన్న నైపుణ్యాన్ని బయట పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మంచి చెడు, నిజం అబద్దం వంటి విషయాలను షేర్ చేసినప్పటికీ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 3.96 బిలియన్ల (58.11% శాతం) మంది సోషల్ మీడియాలో విహరిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఇటలీకి చెందిన జోష్, లిసా తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ మహిళ హాక్ స్టెప్ ట్యుటోరియల్ ద్వారా రెండు డబ్బాల పాస్తా పోసి సాస్‌పై మీట్‌బాల్స్, బ్రెడ్, సలాడ్స్, న్యూడిల్స్, చీజ్ ఇంకా కొన్ని పదార్థాలను కలిపి పాస్తా తయారుచేసింది. ఈమె ఫేస్బుక్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 27 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు.
ఆ మహిళ బల్లపై ఈ విధంగా ఆహారం తయారు చేయడం చూసి నెటిజన్లు ఎంతో షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కొందరు నేను మీ ఇంటికి విందుకు వస్తాను అంటే దయచేసి రావద్దు అని చెప్పండి అంటూ కామెంట్ చేయగా… మరికొందరు మీకు నాస్టీస్ట్ డిన్నర్ అవార్డ్ ఇవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ మహిళ ఆ పాస్తా ఏ విధంగా తయారు చేసిందో మీరు వీడియో పై ఓ లుక్ వేయండి.