Pavala Syamala: పావలా శ్యామల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ మధ్యకాలంలో తరచు వార్తలలో నిలుస్తున్నారు.ఈమె సినిమాలలో నటించిన సమయంలో ఆర్థికపరమైన విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.ఇలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు మెగాస్టార్ చిరంజీవి సహాయం చేయడమే కాకుండా ప్రతినెల తనకు కొంత అమౌంట్ వచ్చేలా సహాయం చేశారని ఇదివరకు పేర్కొన్నారు.

ఇకపోతే తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే సహాయం చేశారని ఎవరు సహాయం చేయలేదని తెలిపారు. తనకు మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు 10 లక్షల రూపాయల వరకు సహాయం చేశారని వార్తలు వస్తున్నాయి.
ఈ విధంగా తనకు డబ్బు సహాయం చేశారు అంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఇలాంటి వార్తలు ప్రచారం చేయటం వల్ల తనకు సహాయం చేసే వారు కూడా చేయరు అంటూ ఈమె వెల్లడించారు. ఈ విధంగా తనకు ఎవరూ కూడా ఆర్థికపరమైనటువంటి సహాయం చేయలేదంటూ ఈ స్టార్ హీరోల గురించి శ్యామల షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆర్థిక క్రమశిక్షణ లేదు…
ఇలా ఈమె స్టార్ హీరోల గురించి ఇలా మాట్లాడటంతో పలువురు ఈమె ఆ హీరోల పేర్లు చెప్పుకొని పాపులర్ కావాలని చూస్తోంది. ఈమె గొంతెమ్మ కోరికలను తీర్చడం ఎవరివల్లా సాధ్యం కాదంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే తనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని కొందరు వెల్లడించగా మరికొందరు ఈమె ప్రవర్తనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటూ ఈమె గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































