Pavithra Lokesh : గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సీనియర్ జంట గురించి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, మరి కొన్ని రోజులలో పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు హల్చల్ చేసాయి. పవిత్ర లోకేష్, నరేష్ లు సహజీవనం చేస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ పుకార్లకు ఊతం ఇచ్చేలా వీరిద్దరు కలిసి మహాభలేశ్వరం వెళ్లడం వంటివి చేసారు.

ఫేక్ న్యూస్ కి చెక్.. సైబర్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర…
ఇక ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవ్వడంతో వీరి వ్యక్తిగత జీవితాలను గురించి చాలా కథనాలు సోషల్ మీడియాలో రావడం మొదలయ్యాయి. పవిత్ర లోకేష్ మొదటి భర్త అంటూ కన్నడ సీరియల్ నటుడు సుచేంద్ర గురించి రాయడం వంటివి చేసారు. ఇక పవిత్ర పేరు మీద ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, తన ప్రమేయం లేకుండా తన పేరు మీద పలు అకౌంట్ల ద్వారా ఎలా ఫేక్ న్యూస్ లను వ్యాప్తి చేస్తున్నారని సైబర్ పోలీసులను ఆశ్రయించింది పవిత్ర.

ఇక తన మొదటి భర్త అంటూ సుచేంద్ర పేరును ప్రస్థావిస్తున్నారు అసలు పెళ్లే చేసుకోనప్పుడు భర్త ఎలా అవుతాడు, విడాకుల సంగతి ఎలా వస్తుంది మేము సహజీవనం చేసాం అంటూ తెల్చేసింది పవిత్ర లోకేష్. ఇక నరేష్ కుటుంబంతో చక్కటి అనుబంధం ఉందంటూ పెళ్లి రూమర్స్ కి మరింత బలం ఇచ్చింది. ఇక పవిత్ర లోకేష్ కన్నడ సీనియర్ నటుడు మైసూర్ లోకేష్ కూతురు, అలాగే తన సోదరుడు ఆది లోకేష్ కూడా కన్నడ సినిమా రంగంలో నటుడుగా ఉండడం విశేషం.































