Pavitra Lokesh: పవిత్ర లోకేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉంటూ సంచలనంగా మారారు. నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నరేష్ తిరిగి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు.

ఇక వీరిద్దరూ కలిసి ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ ప్రకటిస్తూ సంచలనంగా మారారు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన మళ్ళీ పెళ్లి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరూ బహిరంగంగా చేసినటువంటి రొమాన్స్ మామూలుగా లేదని చెప్పాలి.
ఇలా నరేష్ పవిత్ర వ్యవహార శైలి కారణంగా వీరిద్దరూ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అయితే వీరి వ్యక్తిగత వ్యవహారం ఎలా ఉన్నా పవిత్ర మాత్రం ఒక విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున నేటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇంతకీ పవిత్ర లోకేష్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటి అనే విషయానికి వస్తే పవిత్ర లోకేష్ తన మాతృభాష కన్నడ సాహిత్యంలో పిహెచ్డి చేయాలని నిర్ణయించుకున్నారట.

Pavitra Lokesh: పవిత్ర లోకేష్ గ్రేట్…
ఈ క్రమంలోనే పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాయడం కోసం ఈమె హంపి కన్నడ యూనివర్సిటీకి వెళ్లారు.అయితే నరేష్ దగ్గరుండి ఆమెను బళ్లారి తీసుకెళ్లి తనతో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాయించడం విశేషం.అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో తెలియడంతో పవిత్ర లోకేష్ దక్షిణాది అన్ని భాషలలో సినిమాలలో నటిస్తున్నప్పటికీ తను మాతృభాష కన్నడ సాహిత్యంలో పిహెచ్డి చేయాలనుకున్నటువంటి నిర్ణయం పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.