AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు మరింత హీట్ పెంచేస్తున్నాయి. ఎన్నికలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉంది ఇలాంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే పోటాపోటీగా రెండు పార్టీలు మేనిఫెస్టోలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మరింత లబ్ధి చేకూరేలా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించారు. అయితే తన అబద్దాల హామీలకు ఇప్పటికే బలైనటువంటి రాష్ట్ర ప్రజలు మరోసారి చంద్రబాబుని నమ్మే పరిస్థితులు ఏపీలో కనపడటం లేదని తెలుస్తుంది. ఇలా అద్భుతమైనటువంటి సూపర్ సిక్స్ పథకాలతో మేనిఫెస్టో ప్రకటించినప్పటికీ బాబుకి ఓటమి భయం కళ్ళముందు కనపడుతుంది.
మేనిఫెస్టో విడుదల చేసిన ప్రజల నుంచి ఏ విధమైనటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఈయన ప్లాన్ రివర్స్ చేశారు. తన మేనిఫెస్టో పై తనకు కూడా నమ్మకం లేకపోవడంతో తన మేనిఫెస్టోలో అమలు పరచిన పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్లకోకుండా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ అంటూ సరికొత్త అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు.
ల్యాండ్ టైటలింగ్…
మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం నవరత్నాలు అంటూ సంక్షేమ పథకాలు గురించి భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుండగా చంద్రబాబు నాయుడు మాత్రం మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను పక్కనపెట్టి ల్యాండ్ టైటిలింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడుకి తన ఓటమి కళ్ళ ముందు కనపడుతుందని తన మేనిఫెస్టో పై తనకే నమ్మకం లేని పరిస్థితులలో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలుస్తోంది.





























