ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. తమ అందాల్ని మరింత పెంచుకోవడానికి స్టార్ హీరోయిన్లు సైతం ఈ సర్జరీలు చేసుకున్నారు. అలా ఇప్పటికే ఓ సర్జరీ చేసుకుంది స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. ఈ హీరోయిన్ కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సంగతి అందరికీ తెలుసు.అలాగే ఆ తరువాత తన పెదవులు అందంగా కనిపించడానికి కూడా శృతి హాసన్ సర్జరీ చేయించుకుందని అన్నారు.

కాగా తాజాగా శృతి హాసన్ ఇప్పుడు మళ్ళీ సర్జరీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శృతి హాసన్ వయస్సు 35 సంవత్సరాలు. మోహంలో కాస్త వయసు కనిపిస్తోందట.అందుకే ఫేస్ లో గ్లామర్ ను పెంచుకోవడానికి శృతి మళ్ళీ సర్జరీకి రెడీ అవుతుంది. ఇక శృతి హాసన్ మొదటి సినిమా టైమ్ లోనే ఆమె ముక్కుకి దెబ్బ తగిలి విరిగింది. దాంతో మేకప్ వేసి కవర్ చేస్తే గానీ, ఆమె ముక్కు అందంగా కనిపించేది కాదు. అప్పట్లో ఆమె ముక్కు పై అనేక విమర్శలు కూడా చేశారు.

అయితే మళ్ళీ ఈ మధ్య శృతి హాసన్ పై కొత్త విమర్శలు మొదలెట్టారు. ఈ మధ్య ఆమె ఫేస్ లో వయసు ఎక్కువగా కనిపిస్తోందని, ముడతలు ఛాయలు కూడా కనిపిస్తున్నాయని గతంలో లాగా నాజూకుతనం ఆమెలో కనిపించడం లేదని, అందుకే బహుశా ఆమె మళ్ళీ సర్జరీకి రెడీ అయిందని అంటున్నారు..ఇక ఈ అమ్మడి కెరీర్ విషయానికొస్తే.. గత కొంతకాలంగా సినిమా అవకాశాలు లేక తెగ ఇబ్బంది పడ్డ ఈమె

మళ్ళీ ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజ సరసన నటించి మంచి కం బ్యాక్ అందుకుంది..ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ సరసన వకీల్ సాబ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ‘సలార్’ అనే సినిమా చేస్తుంది శృతిహాసన్…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here