Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మిగతా హీరోలతో పోలిస్తే అభిమానిలలో క్రేజ్ కాస్త ఎక్కువ అనే చెప్పుకోవాలి. మిగతా హీరోలందరికి ఫాన్స్ మాత్రమే ఉంటే ఈయనకు ఏకంగా ఆరాధించే భక్తులు ఉంటారు. మామూలుగా ఫాన్స్ కు అభిమానం ఎక్కువ అయితే రక్త దానాలు, వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇంకా ఎక్కువ అయితే గుడి కట్టి పూజలు చెయ్యడం చూసాము. అయితే పవన్ అభిమానులు మాత్రం తమ రక్తన్ని కూడా లెక్క చేయకుండా పవన్ మీద అభిమానాన్ని, భక్తిని చాటుకున్నారు.

ఇనుప చువ్వలను తమ వీపుకి గుచ్చుకుని జేసీబీ కొక్కానికి వేలాడుతూ…
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పవన్ కు తమిళనాడులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇపుడు తాజాగా పవన్ మీద వారి అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించారు. తమిళనాడు లో యేటా జరిగిర్ హోసూరు కావడి పండుగలో పవన్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని వెరైటీ గా చూపించారు. ఇనుప చువ్వలను తమ వీపుకి గుచ్చుకుని ఏకంగా జేసీబీ కొక్కానికి వేలాడుతూ మరీ పవన్ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. అంతే కాకుండా తలైవా పవన్ అంటూ నినాదాలు కూడా చేశారు.

అయితే ఇటీవల ఎన్టీఆర్ తమిళ అభిమానులు కూడా ఇలానే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ప్రదర్శించి వారి అభిమానాన్ని తెలియజేసారు. ఇపుడు తాజాగా పవన్ అభిమానులు వేలాడుతూ నినాదాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
































