Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం రోడ్డు షోలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుత వైరల్ అవుతున్నాయి. జనసేన అధినేతగా కొనసాగుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈయన పిఠాపురంలో వైసిపి అభ్యర్థి వంగ గీతకు పోటీగా ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. పిఠాపురంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే నేటితో ప్రచార కార్యక్రమాలు ముగియబోతున్నాయి ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం రోడ్ షోలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
వైసిపి అధినేతలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వస్తే తన మూడు పెళ్లిళ్ల గురించి తన భార్యల గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ విషయంపై తన భార్య చాలా బాధపడింది అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. తన భార్య విదేశీయురాలు.తనకు మన రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన లేదు.
నేను రాజకీయాలలోకి వచ్చి ధర్మం కోసం నిలబడితే చివరికి నా భార్యను కూడా తిట్టారని ఈయన వెల్లడించారు. భారత రాజకీయాలు తనకు అర్థం కాకపోవడంతో ఎందుకు ఇంట్లో ఉన్నటువంటి వారిని కూడా తిడతారు అంటూ నన్ను అడిగి.మరీ బాధ పడిందని తెలిపారు. ఈ విషయంలో నేను తనకు క్షమాపణలు చెప్పానని పవన్ వెల్లడించారు.
అసెంబ్లీలో అడుగు పెడతారా..
ఈ ఐదు కోట్ల మంది ప్రజల కోసం మన కుటుంబం బలైన పరవాలేదు ఒప్పుకుందాం అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా పిఠాపురంలో పర్యటనలు చేస్తూ తనని గెలిపించాలని కోరారు మరి భారీ స్థాయిలో సినీ మద్దతు కైవసం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదంటే వైసీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో మరోసారి ఓటమి ఎదుర్కొంటారా అనేది తెలియాల్సి ఉంది.





























