Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈసారి కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో విజయం సాధించారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ విజయాన్ని అందుకోవడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో ఈయన డిప్యూటీ సీఎం అవుతారంటూ కూడా వార్తలు వస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఈయన ఏ పదవులపై ఆసక్తి కనబరుస్తున్నారు అనే విషయం గురించి కూడా వెల్లడించారు.
ఇటీవల ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ తనకు ఎక్కువగా పర్యావరణ కాలుష్య నివారణ పై పనిచేయాలని ఉందని తెలిపారు. దీనితోపాటు వ్యవసాయం రైతులకు సంబంధించిన ఇరిగేషన్ పై ఆసక్తి ఉంది అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈయనకు మాత్రం డిప్యూటీ సీఎం లేదంటే హోమ్ మినిస్టర్ ఇస్తారని అందరూ భావిస్తున్నప్పటికీ ఆ రెండు పదవులు తనకు పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది.
వ్యవసాయం.. ఇరిగేషన్
ఈ విధంగా పవన్ కళ్యాణ్ తనకు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టమని చెప్పడంతో బహుశా ఆ మంత్రి పదవినే ఆయన ఆకాంక్షిస్తున్నారని తెలుస్తోంది చూడాలి మరి ఏపీ కేబినెట్ లో పవన్ ఎలాంటి కీలక పదవులను అధిరోహిస్తారో తెలియాల్సి ఉంది.





























