Pawan Kalyan: ఏపీ ఎన్నికలకు కేవలం 9 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇకపోతే కూటమి సభ్యులు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే .ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ పై విమర్శలు చేశారు.

ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా గిద్దలూరులో ప్రచార కార్యక్రమాలను నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సెగ్మెంట్లో జనసేన పార్టీకి బలం ఉన్నప్పటికీ కూడా కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి సీట్లను త్యాగం చేశామని ఈయన వెల్లడించారు.
ఈ ఎన్నికలలో సీఎం జగన్ కు వెన్నులో భయం పుట్టాలని పవన్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి విధేయతతో కాకుండా రౌడీయిజంతో ఓట్లు అడుగుతున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఓటుతో బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పట్ల చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
మంచి జరిగితేనే ఓటు వేయండి…
ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు మండిపడుతున్నారు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రౌడీయిజంతో ఓట్లు అడుగుతున్నారు అంటూ మాట్లాడటం ఎంతవరకు సబబు అంటూ పవన్ కళ్యాణ్ కు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.





























