Pawan Kalyan -Ali: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమెడియన్ అలీ మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారు అంటే తప్పకుండా అందులో అలీ పాత్ర ఉండాల్సిందే. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో విడదీయరాని స్నేహబంధం ఉందని చెప్పాలి.

ఇలా చిత్ర పరిశ్రమలో స్నేహితులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వీరిద్దరిని రాజకీయాలు వేరు చేశాయని చెప్పాలి. గత ఎన్నికలలో భాగంగా రాజకీయాలపై ఆసక్తి కనబరిచిన ఆలీ అందరూ అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతారని భావించారు కానీ అలీ మాత్రం ఊహించని విధంగా జగన్ పార్టీకి మద్దతు తెలిపారు.
ఇలా రాజకీయాలలోకి రావడం వల్ల అలీ పవన్ కళ్యాణ్ మధ్య కాస్త దూరం పెరిగిందని వీరిద్దరి మధ్య స్నేహం కూడా చెడిపోయిందని వార్తలు వచ్చాయి.కానీ ఆలీ మాత్రం రాజకీయాలు వేరు స్నేహబంధం వేరు మా ఇద్దరి మధ్య ఎప్పటిలాగే అదే స్నేహబంధం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై కొందరు మరి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత నటించిన వకీల్ సాబ్ భీమ్లా నాయక్ సినిమాలలో కనిపించలేదేం అనే సందేహాలను వ్యక్తపరిచారు.

Pawan Kalyan -Ali: రాజకీయం వేరు.. స్నేహబంధం వేరు
ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలలో అలీ కనిపించకపోవడానికి ఓ కారణముందని పవన్ నటించిన ఈ రెండు సినిమాలలో ఎక్కడ కామెడీ లేకపోవడంతో తను కూడా సినిమాలలో నటించలేదంటూ ఈ సందర్భంగా ఆలీ పవన్ కళ్యాణ్ తో తనకు ఏ విధమైనటువంటి మనస్పర్ధలు గొడవలు లేవంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.































