Pawan Kalyan -Ali:టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు సంపాదించుకున్న అలీ కుమార్తె వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఇక ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా హాజరయ్యారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాలేకపోయారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ అలీ కుమార్తె వివాహానికి హాజరు కాకపోవడంతో వీరిద్దరి మధ్య రాజకీయపరంగా విభేదాలు తల్లితాయని వీరి స్నేహం చెడింది అంటూ పెద్ద ఎత్తున ఆలీ పవన్ కళ్యాణ్ స్నేహబంధం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
ఇలా అలీ పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించి తమ గురించి వస్తున్నటువంటి విమర్శలకు పుకార్లకు క్లారిటీ ఇచ్చారు.అలీ తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ ఆహ్వానించానని అయితే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కూడా రూట్ మ్యాప్ చెక్ చేసుకుని వెళ్లారని తెలియజేశారు.

Pawan Kalyan -Ali: పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు…
పవన్ కళ్యాణ్ పెళ్లికి రావాలని బయలుదేరే ముందుగా ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతోనే ఆయన తన కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయారంటూ ఈ సందర్భంగా అలీ తెలియజేశారు.ఇక పవన్ కళ్యాణ్ పెళ్లికి రాలేకపోవడంతో స్వయంగా తనకు ఫోన్ చేసి త్వరలోనే తాను తన కుమార్తె అల్లుడిని ఆశీర్వదిస్తానని త్వరలోనే కలుస్తానని కూడా చెప్పారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి తను తన కుమార్తె వివాహానికి రాకపోవడం గురించి అలీ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

































