Pawan Kalyan: ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహకు అందని విధంగా వెలువడ్డాయి. గత ఎన్నికలలో 151 సీట్లతో విజయం సాధించిన వైఎస్ఆర్సిపి పార్టీ ఈసారి కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఇలా 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది. మరి రెండు రోజులలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఈ తరుణంలోనే ఏపీ క్యాబినెట్లో ఎవరికి ఎలాంటి పదవులు రాబోతున్నాయనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇక కూటమి అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ కూడా కీలక పాత్ర పోషించిందనే విషయం మనకు తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 23 స్థానాలలో పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ఏపీ క్యాబినెట్లో కీలక పదవులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇక నిన్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి హాజరయ్యారు.
ఇక ఈ ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ ఇండియా టుడే ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తనకు డిప్యూటీ సీఎం పదవిపై ఆసక్తి ఉందన్నట్లు వెల్లడించారు. అయితే ఈ పదవి విషయంపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదు ఇక త్వరలో జరగబోయే ఎన్ డి ఏ ఎమ్మెల్యేల భేటీ సమయంలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
హోమ్ మినిస్టర్..
ఈ విధంగా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వాలని అభిమానులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి పదవులు అందుకుంటారు ఏంటి అనే విషయాలు మరొక రెండు రోజులలో తెలియనున్నాయి. ఇక కేంద్రంలో కూడా ఈసారి ముగ్గురు ఎంపీలు మంత్రి పదవులు అందుకోవడం గమనార్హం.





























