Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అయితే కూటమిలో భాగంగా ఈయన ఎన్నికల బరిలోకి దిగిన సంగతి మనకు తెలిసిందే .అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మైనారిటీలకు రిజర్వేషన్ల గురించి పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్ ఉండదనే వాదన ప్రజలలోకి వెళ్ళింది.

ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక నేషనల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ కు కాపులు అలాగే ముస్లిమ్స్ రిజర్వేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు పవన్.
ఈ సందర్భంగా జర్నలిస్ట్.. ముస్లింల రిజర్వేషన్లు అమలు చేయబోమని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు కదా.. మరి మీకు నిరాశ లేదా అని ప్రశ్నించారు. దానికి పవన్ స్పందిస్తూ.. ఈ విషయంలో తాను ఏమాత్రం నిరాశ చెందడం లేదని తెలిపారు. ముస్లింలకు మాత్రమే కాకుండా కాపులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటే అది కుదరని పని అని తెలియజేశారు.
రిజర్వేషన్లు కుదరవు..
ఇలా అన్ని కులాల వరకు 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండకూడదని కోర్టు తెలిపారు. దీంతో అందరికీ రిజర్వేషన్లు కల్పించాలి అంటే కుదరదని దాని స్థానంలో మరో ప్రత్యామ్నాయం చూడాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ముస్లింల రిజర్వేషన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనారిటీల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు తాను అండగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన దానికి.. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకు పొంతన లేదంటూ మండిపడుతున్నారు.





























