Pawan Kalyan: ఏపీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగినటువంటి ఈయన తప్పకుండా గెలుస్తారని పలు సర్వేలు వెల్లడించాయి.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అంటూ సర్వేలు తెలియజేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా గెలుపుపై ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గెలవాలని ఎంతోమంది అభిమానులు కూడా ఆంకాక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతోమంది అభిమానులు మొక్కులు మొక్కుకోవడం పూజలు చేయటం మనం చూస్తున్నాము.
ఇటీవల ఓ మహిళా అభిమాని ఏకంగా మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన సంగతి మనకు తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఓ హీరోయిన్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం రహస్యంగా పూజలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికలలో ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలవాలని అనుభవించిన ఆమె రహస్యంగా యాగాలు హోమాలు చేయిస్తూ ఉన్నట్టు సమాచారం.
రహస్య పూజలు…
ఇక ఆ హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో కూడా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం హీరోయిన్ చేస్తున్నటువంటి ఈ పని తెలిసే అందరూ షాక్ అవుతున్నారు. మరి అందరు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పై ఉండి పవన్ ఈ ఎన్నికలలో విజయం సాధిస్తారా లేదా అనే విషయాలు మరి కొన్ని గంటలలో తెలియనున్నాయి.





























