Rocking Rakesh: రాకింగ్ రాకేష్ జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ ఎంతో సుపరిచితమే అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేయడంతో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ వీడియో పై మాటల యుద్ధం దిగారు. ఆ దెబ్బకు ఈయన ఏకంగా ఆ వీడియోని డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. ఇంతకీ రాకేష్ డిలీట్ చేసిన ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే..

ప్రస్తుతం ఆంధ్రలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఏపీ ఎన్నికలపైనే ఉంది పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో జబర్దస్త్ టీం మొత్తం అక్కడే ఉంటూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు నగరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సినీనటి జబర్దస్త్ మాజీ జడ్జ్ రోజా తరఫున రాకింగ్ రాకేష్ నగరిలో వైసిపి ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాకేష్ ఒక అవ్వతో మాట్లాడుతూ నీ ఓటు ఎవరికి వేస్తావు అని అడిగారు. మా ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయి ఆ15 ఓట్లు నేను జగన్మోహన్ రెడ్డికే వేస్తానని ఆమె అనుకూలంగా మాట్లాడారు. ఇక ఈ వీడియోని రాకేష్ షేర్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిరగబడ్డారు. ఇండస్ట్రీలో ఇక నీకు ఛాన్సులు ఉండవు నిన్ను తొక్కేస్తారు అంటూ మాటల దాడికి దిగారు.
వైసీపీకి అనుకూలం..
ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు రాకేష్ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి కామెంట్లు చేయడంతో ఆయన భయపడి ఆ వీడియోని డిలీట్ చేశారు అయితే పిఠాపురంలో జబర్దస్త్ టీం మొత్తం పర్యటన చేస్తున్న వారికి ఎక్కడా కూడా వైసిపి నేతల నుంచి ఎదురు దెబ్బ తగలలేదు కానీ రాకింగ్ రాకేష్ కి మాత్రం ఇలా బెదిరింపులకు గురి చేయడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.





























