Pawan Kalyan: కొరటాల శివ విజయానికి మారుపేరుగా నిలిచినటువంటి ఈయన ఆచార్య సినిమాతో పరాజయం పాలయ్యారు.ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ వాడటంతో చిరంజీవి లుక్ పూర్తిగా మార్చేశారని పెద్దఎత్తున మెగా అభిమానులు కొరటాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కొరటాల శివ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తప్పనిసరిగా సినిమా వస్తుందని వెల్లడించారు.అయితే ఆచార్య సినిమా విడుదల అయి ఈ సినిమా ఫలితాన్ని చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున సోషల్ మీడియా వేదికగా కొరటాల పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా మాకొద్దు మహాప్రభో అంటూ మీమ్స్, పోస్టులు పెడుతున్నారు.
కొరటాల నుంచి ఊహించలేదు…
ఈ క్రమంలోనే వీటిపై మరికొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ… ఈ కాంబినేషన్లో సినిమా మాకొద్దు మేము మరో ఆచార్య సినిమాని చూడాలనుకోవడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఆచార్య సినిమా ఫై ఎన్నో అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు కొరటాల తీవ్ర నిరాశ కలిగించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున సోషల్ మీడియా వేదికగా ఇలాంటి మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
































